– బైంసా జీడీఆర్ మెమోరియల్ కృష్ణ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో ఎన్ఈ హెచ్ఎస్ సేవలు
– అందుబాటులో అన్ని రకాల ప్రత్యేక వైద్య నిపుణులు
– అధునాతన పరికరాలతో అపరేషన్ థియేటర్లు, శస్త్ర చికిత్సలు
– కార్పోరేట్ తరహాలో ప్రారంభమైన ఎన్ఈహెచ్ఎస్ సేవలు
– సేవలు సద్వినియోగం చేసుకోవాలి ఆసుపత్రి ఎండీ డా. అనిల్ కుమార్ జాదవ్
బైంసా, (శ్రీకరం న్యూస్):
ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకవచ్చిన న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఎస్ఈహెచ్ఎస్) సేవలు బైంసాలోని జీడీఆర్ మెమోరియల్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారి కుటుంబీకులకు అన్ని రకాలుగా పూర్తిస్థాయి వైద్య సేవలు అందించేందుకు జీడీఆర్ మెమోరియల్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాట్లు చేపట్టారు. పెద్ద నగరాల్లోని కార్పోరేట్ ఆసుపత్రుల తర హలో జీడీఆర్ మెమోరియల్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆధునాతన వైద్య పరికరాలు. అపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేశారు. అన్ని రకాల చికిత్సలు అందించేందు, శస్త్ర చికిత్సలు నిర్వహించేందుగాను ప్రత్యేక వైద్య నిపుణులను అందుబాటులోకి తీసుక వచ్చారు. ఇక్కడి ప్రాంత ఉద్యోగులు ఎన్ఈ హెచ్ఎస్ సేవల కోసం వ్యయ, ప్రయాసాలకు ఒనర్చుతూ ఇతర ప్రాంతాలకు వెళ్లే అవసరము లేకుండా జీడీఆర్ మెమోరియల్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలను అందించేందుకు అవసరమైన పూర్తి స్థాయి లో వసతులు, సౌకర్యాలు సమకూర్చారు. సకాలంలో మెరుగైన రీతిలో నాణ్యతతో కూడిన వైద్య సేవలు అందించేందు గాను జీడీఆర్ మెమోరియల్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సన్నద్ధం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఎస్ఈహెచ్ఎస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి..
జీడీఆర్ మెమోరియల్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మెనేజింగ్ డైరెక్టర్ డా. అనిల్ కుమార్ జాదవ్..
ఇక్కడి అన్ని ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, వారి కుటుంబీకులకు ఎన్ఈహెచ్ఎస్ పథకం ద్వారా జీడీఆర్ మెమోరియల్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలను అందిస్తున్నాం. కార్పోరేట్ ఆసుపత్రుల తరహ లోనే ఆధునాతనమైన విధానాల్లో అన్ని రకాలుగా చికిత్సలు, శస్త్ర చికిత్సలను అందుబాటులోకి తీసుకవచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులు జీడీఆర్ మెమోరియల్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా ఎన్ఈహెచ్ఎస్ పథకం సేవలను సద్వినియోగం చేసుకోవాలి.

