612 కిలో మీటర్లు పూర్తయిన అయ్యప్ప స్వాముల పాదయాత్ర

– గత నెల 26న బాసర నుంచి ప్రారంభమైన పాదయాత్ర
– రోజుకు సగటున 35 కిలోమీటర్ల మేర పాదయాత్ర
– డిసెంబరు 10న శబరీకి చేరుకోనున్న పాదయాత్ర బృందం
– ఆష్ట గురుస్వామి బొందుగుల సునీల్ దత్ సారధ్యంలో కొనసాగుతున్న పాదయాత్ర

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

బైంసా, (శ్రీకరం న్యూస్) గత నెల 26న బాసర నుంచి శబరిమలకు ప్రారంభమైన ఆయ్యప్ప స్వాముల పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ముధోల్ మండలం అష్ట గ్రామానికి చెందిన గురుస్వామి బొందుగుల సునీల్ దత్ సారద్యంలో కొనసాగుతున్న పాదయా యాత్ర బృందంలో 55 మంది స్వాములున్నారు. విరంతా రోజుకు సగటున 35 కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర చేపడుతున్నారు. శుక్రవారం పాదయా త్ర 19వ రోజుకు చేరుకోగా 612 కిలో మీటర్ల దూరం ప్రయాణం పూర్తయ్యింది. శుక్రవారం రాత్రి పాదయాత్ర బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అనంతపూర్ జిల్లా ప్యాపిలి గ్రామానికి చేరుకొని బస చేసింది.

# శబరిమల క్షేత్రానికి మరో 868 కిలో మీటర్ల దూరంలో పాదయాత్ర బృందం

బాసర నుంచి పాదయాత్ర చేపట్టిన అయ్యప్ప స్వాముల పాదయాత్ర బృందం శబరీ గిరిషునికి మరో 868 కిలో మీటర్ల దూరంలోనున్నారు..డిసెంబరు 10 వరకల్లా శబరిమల చేరుకునే లక్ష్యంతో పాదయాత్ర బృందం ముందుకు సాగుతోంది. ప్రతికూల వాతవరణంలో నెలకొం టున్న ఆవాంతరాలు, అడ్డంకులను అధిగమిస్తూ పాదయాత్ర విజయవంతంగా కొనసాగిస్తున్నారు. శబరీ గిరిషుని నామ స్మరణ చేపడుతూ,శరణు ఘోష గేయాలు ఆలపిస్తూ పాదయాత్ర ఆధ్యాంతం ఆధ్యాత్మిక వాతవరణంలో జోరుగా హుషారుగా కొనసాగుతోంది.

*రోజువారి పాదయాత్ర ఇలా….

పాదయాత్ర బృందం రోజుకు సగటున 35 కిలో మీటర్ల మేర లక్ష్యం పెట్టుకొని అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. రాత్రి వేళ బస చేసిన స్థలిలో వేకువ జామున 4 గంటల వరకల్లా పూజలు ముగించుకొని పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు పాదయాత్ర చేపడుతున్నారు. అనంతరం 9 గంటల నుంచి 12 గంటల వకరు విశ్రాంతి తీసుకుంటున్నారు. మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల మధ్య బిక్ష పూర్తి చేసుకొని 3 గంటల నుంచి మళ్లీ పాదయాత్ర చేపడుతున్నారు. రాత్రి 7 గంటల వరకు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అటు తరువాత అనువైన స్థలిలో బస చేసి రాత్రి పూట పూజలు, అల్పాహారం తీసుకోవడం, నిద్రించడం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *