ఏసీబీ వలలో భైంసా ఇంచార్జీ మున్సిపల్ కమిషనర్ జాదవ్ సంతోష్

– కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
– నిర్మల్ కుబేర హోటల్ వద్ద ఘటన

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

బైంసా, (శ్రీకరం న్యూస్): భైంసా మున్సిపల్ ఇంచార్జీ కమిషనర్ జాదవ్ సంతోష్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖాధికారులకు పటుబడ్డారు. మంగళవారం సాయంత్రం నిర్మల్ పట్టణంలోని మంచిర్యాల్ చౌరస్తా ప్రాంతంలోని కుబేర హోటల్ సమీపంలో ఘటన జరిగింది. భైంసా మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ తో పాటు ఇంచార్జీ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న జాదవ్ సంతోష్ ఒక కాంట్రక్టర్ కు బిల్లు చెల్లించే విషయంలో రూ.50 వేలు లంచం డిమాండ్ చేసినట్లుగా తెలిసింది. సంబంధిత విషయంలో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లుగా తెలిసింది. ఇందులో భాగంగానే ఏసీబీ అధికారుల సూచన మేరకు సదరు కాంట్రాక్టర్ నిర్మల్ లోని కుబేర్ హోటల్ సమీపంలో రూ.50 వేలను ఇంచార్జీ కమిషనర్ జాదవ్ సంతోష్ కు లంచంగా ఇచ్చాడు. ఇదే సమయంలో అక్కడే కాపు కాచి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా ఆయనను పట్టుకున్నట్లుగా తెలిసింది, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *