– ఆపన్నహస్తం అందిస్తున్న మానవతామూర్తులు
భైంసా ( శ్రీకరం న్యూస్): తల్లిదండ్రులను కోల్పోయి అనాధగా మారిన బైంసా పట్టణంలోని గణేష్ నగర్ కాలనీకి చెందిన అవళిక అనే బాలికకు దాతల ఆర్థిక సాయం అందజేత కార్యక్రమం కొనసాగుతోంది. మానవతా మూర్తులు బాలికకు అపన్న హస్తం అందిస్తున్నారు. రెండు రోజులుగా ఎందరో మంది దాతలు బాలికకు చేదోడు వాదోడుగా నిలిచేందుకుగాను స్పందిస్తున్నారు. ఎవరికి తోచినంతగా వారు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. భవిష్యత్తుకు భరోసా కల్పించే రీతిలో తోడ్పాటు నిస్తున్నారు. బాలిక కుల సంఘ ప్రతినిధులను, కాలనీ ప్రతినిధులను సంప్రదిస్తూ బాలిక భవిష్యత్తుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా వెల్లడిస్తున్నారు. బాలికకు సంబంధించి ఏవైనా అవసరాలు ఉంటే తమను సంప్రదిస్తే తీరుస్తామని పలువురు పేర్కొంటున్నారు.