# ఆర్థిక సాయం అందచేత
# దాతల సహకారంతో తల్లి అంత్యక్రియలు పూర్తి
# అంత్యక్రియలకు కుల సంఘం, ఐక్యత సేవా సమితి సేవలు
# మేనమామతో కలిసి తల్లి చితికి నిప్పుపెట్టిన చిన్నారి
బైంసా, (శ్రీకరం న్యూస్): తల్లితండ్రుల మరణంతో దిక్కుతోచని స్థితికి చేరుకున్న భైంసా పట్టణంలోని గణేష నగర్ కాలనీకు చెందిన బాలిక కనికరం అవలికకు మానవతవాదులు అండదండగా నిలిచారు. అనాధగా మారి న బాలికకు అపన్నహస్తం అందించారు. సోమవారం అనారోగ్యంతో మృతి చెందిన తల్లి అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు. దాతల సాయంతో మేదరి కుల సంఘ సభ్యులు, ఐక్యత సేవా సమితి శ్రేణులు మృతి చెందిన బాలిక తల్లి కనికరం గంగామణి అంత్యక్రియలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. బాలిక ఆవలిక తన మేనమామతో కలిసి తల్లి అంత్యక్రియల తంతు చేపట్టింది.
మమ్మీ లేవమ్మా… నన్నేవరు చూసుకుంటారు
నాలుగు సంవత్సరాల క్రితం తండ్రి మరణాంతరం తల్లి కనికరం గంగామణి కూతురు అవలికను అన్నీ తానై అల్లరు ముద్దుగా పెంచింది. అలాంటి తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో కూతురు అవలికకు అంతులేని విషాదాన్ని నింపింది. అనాదగా మార్చివేసింది. దిక్కుతోచని స్థితికి చేరుకున్న అవలిక తల్లి మృతదేహం పై పడి మమ్మీ లేవమ్మా… నన్నెవరు చూసుకుంటారమ్మా, నీవు చెప్పినట్లుగానే నడుచుకుంటానమ్మ అంటూ ఒక సారి లేవమ్మా అంటూ రోదించిన తీరు అందరిని కలిచివేసింది. కన్నీరుమున్నీరై విలపించిన బాలికను అపడం ఎవరి తరం కాలేదు. శ్మశనవాటికలో తల్లి చివరి చూపు చూస్తూ బాలిక మమ్మీ వెళ్లిపోతున్నావా అంటూ కేకలు పెడుతూ విలపించడం అక్కడికి వచ్చిన వారందిని కంట తడిపెట్టించింది. బంధువులు బాలికను సముదాయి స్తూ అంత్యక్రియల తంతు పూర్తి చేసారు. పెద్దపెట్టున రోదిస్తున్న బాలికను సముదాయిస్తూ ఇంటికి తీసుకవెళ్లారు.
