తల్లి అంత్యక్రియలకు ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు! –

– నాలుగేళ్ల క్రితం తండ్రి.. తాజాగా తల్లి కోల్పోయిన బాలిక
– సాయం చేయాలని రెండు చేతులు చాచి వేడుకోలు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

భైంసా (శ్రీకరం న్యూస్): సరిగ్గా నాలుగేళ్ల క్రితం తండ్రి.. అనారోగ్యంతో నేడు తల్లి మరణించగా.. కూతురు అనాథ బాలికగా మిగిలిపోయింది. కడు పేదరిక కుటుంబం కావడంతో తల్లిదండ్రులను కోల్పోయిన నాలుగో తరగతి చిన్నారి తల్లి అంత్యక్రియలు కోసం రెండు చేతులు చాచి వేడుకోంటోది. ఈ హృదయవిదారక ఘటన భైంసా పట్టణంలోని గణేష్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన సాయినాథ్‌, గంగామణి దంపతుల కుమార్తె అవలిక నాలుగో తరగతి చదువుతోంది. తండ్రి సాయినాథ్ నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి గంగామణి సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో అవలిక తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలింది.
కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా డబ్బులు లేక చిన్నారి దిక్కుతోచని స్థితిలో ఉంది. కన్నతల్లి మృతదేహం వద్ద దీనంగా ఎదురుచూస్తున్న ఆ చిన్నారి పరిస్థితి స్థానికులను కలచివేస్తోంది. ఈ విషాద సమయంలో దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చిన్నారికి ఆపన్నహస్తం అందించాలని స్థానికులు కోరుతున్నారు. అంత్యక్రితయ నిర్వాహణతో పాటు చిన్నారి అవసరాలను తీర్చడం కోసం భవిష్యత్తులో ఆమెకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *