# మహా గౌరి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు
# భైంసా ఆర్యవైశ్య మండలి ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రి మహోత్సవాలు
బైంసా, (శ్రీకరం న్యూస్): మున్సిపల్ కేంద్రమైన భైంసాలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నవరా త్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బైంసా ఆర్యవైశ్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వేడుకలు అధ్యాంతం కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. వేడుకలలో భాగంగా ఆదివారం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మ వారు ఆష్టమిని పుర స్కరించుకొని మహా గౌరి అవతారములో దర్శనమిచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మవారిని రూ.10 లక్షల కరెన్సీతో శోభయమానంగా అలంకరించారు. నవరాత్రి వేడుకలలో భాగంగా ప్రతియేటా అమ్మవారిని వివిధ అవతారాల్లో అలంకరిస్తుండగా ఆదివారం మహా గౌరి రూపంలో కరెన్సీతో చేపట్టిన అలంకరణను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. భైంసా ఆర్యవైశ్య మండలి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయినాథ్ దంకొండువార్, చందూర్ సంతోష్, కోశాధి కారి ముత్యపువార్ రాజ్ గంగాధర్, సహా కోశాధికారి రాజు బుడికేవార్ ల నేతృత్వంలో వేడుకలు వైభవోపేతంగా కొనసాగ తున్నాయి.